క‌రోనా త‌గ్గిన రోగుల్లో ఈ ముప్పు లైఫ్ లాంగ్ ఉంటుందా… మ‌నిషి బ‌తికున్నా లేన‌ట్టే…!

క‌రోనా వైర‌స్ గురించి ప‌రిశోధ‌న‌ల్లో రోజుకో కొత్త విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. ఈ కొత్త కొత్త విష‌యాలు ఎంతో భ‌యాన‌కంగా ఉండ‌డంతో పాటు విస్తుగొలిపేలా ఉంటున్నాయి. క‌రోనా సోకిన వారికి రోగం త‌గ్గినా కూడా ఎన్నో కొత్త కొత్త స‌మ‌స్య‌లు పుట్టుకు వ‌స్తున్నాయి. ఇక తాజా అధ్య‌య‌నాల ప్ర‌కారం క‌రోనా త‌గ్గిపోయినా కూడా చాలా మందిలో వినికిడి లోపం వ‌స్తోంద‌ట‌. ఇది భ‌విష్య‌త్తులో అలాగే ఉంటుంద‌ని.. ఈ లోపం మాత్రం త‌గ్గ‌ద‌ని చెపుతున్నారు. ఈ మాట ఇప్పుడు క‌రోనా రోగుల్లో తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. వాస్త‌వానికి క‌రోనా వైర‌స్ ముక్కుల్లోనూ, చెవిలోనూ, చెవి ఎముక‌లోనూ ఎక్కువ స్థాయిలో ఉంటోంద‌ని కూడా ప‌రిశోధ‌న‌లు చెపుతున్నాయి.

 

క‌రోనా నుంచి కోలుకున్న వారు చాలా మంది వినికిడి లోపం స‌మ‌స్య ఎదుర్కొంటున్నార‌ట‌. ఈ ఒక్క స‌మ‌స్య మాత్ర‌మే కాదు కోలుకున్న వారిలో వాస‌న‌, రుచి కోల్పోతున్న ల‌క్ష‌ణాలు కూడా తాము గుర్తించిన‌ట్టు మాంచెస్టర్ యూనివర్శిటీ నిపుణులు చెపుతున్నారు. వీరు చెపుతోన్న దాని ప్ర‌కారం కోవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో వినికిడి శ‌క్తి క్షీణించ‌డంతో పాటు టిన్నిటస్ వంటి అనారోగ్య సమస్యలను గుర్తించామని నివేదించారు. ఇక ఇటాలియ‌న్ రోగుల ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం కోవిడ్‌-19 నుంచి కోలుకున్న త‌ర్వాత ప్ర‌తి ప‌ది మందిలో ఒక‌రు త‌మ రుచి లేదా వాస‌న కోల్పోతున్నార‌ట‌.

 

మాంచెస్టర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ ప‌రిశోధ‌న‌లో కోవిడ్‌-19 నుంచి కోలుకున్న వారిలో 8 వారాల త‌ర్వాత 13.2 శాతం మంది వినికిడి కోల్పోయామని చెప్పారు. మరో 8 మంది టిన్నిటస్ స‌మ‌స్య ఉంద‌ని చెప్పారు. మాంచెస్ట‌ర్ వ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ కెవిన్ మున్రో మీజిల్స్, గవదబిళ్ళలు, మెనింజైటిస్ వంటి వైరస్‌ల కారణంగా వినికిడి కోల్పోయే ప్రమాదం ఉందని, మెదడు నుంచి నరాలను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా కోవిడ్‌-19 నుంచి భ‌విష్య‌త్తులో ఇంకెలాంటి ప్ర‌మాద‌క‌ర వార్త‌లు వినాల్సి వ‌స్తుందో ? చూడాలి.

Leave a comment