విజ‌య‌వాడ అమ్మాయికి అరుదైన గౌర‌వం.. విశ్వ‌సుంద‌రిగా ఎంపిక‌..!

కృష్ణా జిల్లా విజ‌య‌వాడ అమ్మాయి నాగ‌దుర్గా కుసుమ‌సాయికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆమెకు తెలుగు విశ్వసుందరి కిరీటం దక్కింది. అమెరికాలో జ‌రిగిన పోటీల్లో ఆమె ఈ కిరీటం గెలుచుకుంది. అక్క‌డ తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా), ఇతర తెలుగు సంస్థలు కలిసి ఆన్‌లైన్‌ వరల్డ్‌ తెలుగు కల్చరల్‌ ఫెస్ట్‌ 2020 పోటీలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే నాగ‌దుర్గా కుసుమ‌సాయి మిస్‌ తెలుగు యూనివర్సల్‌ పోటీల్లో పాల్గొని ఈ కిరీటం గెలుచుకున్నారు.

 

విశ్వసుందరి పోటీలకు 600 పైగా ఎంట్రీలు రాగా ప్రతిభ ఆధారంగా న్యాయనిర్ణేతలు కుసుమసాయిని ఎంపిక చేశారని పోటీ నిర్వాహకులు చైతన్య పొలుజు చెప్పారు. కుసుమసాయి బీకాం చదువుతోందని, ఆమెకు నాట్యం, నాటక రంగాల్లోనూ ప్రవేశం ఉందని తెలిపారు. ఇక నాగ‌దుర్గా కుసుమ‌సాయి ఈ ఘ‌న‌త సొంతం చేసుకోవ‌డంతో విజ‌య‌వాడ వాసులు ఆమెకు అభినంద‌న‌లు తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్టులు హోరెత్తిస్తున్నారు.

Leave a comment