ఊపిరి పీల్చుకునే గుడ్ న్యూస్‌… క‌రోనా వ్యాక్సిన్ భార‌త్‌కు వ‌చ్చేసింది… !

క‌రోనాతో అల్ల‌క‌ల్లోలంగా ఉన్న యావ‌త్ భార‌తావ‌ని ఊపిరి పీల్చుకునే న్యూస్ ఇది. ఆక్స్‌ఫ‌ర్డ్ క‌రోనా వ్యాక్సిన్ భార‌త్‌కు వ‌చ్చేసింది. క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్టేందుకు ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాక్సిన్ కోసం ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆక్స్‌ఫ‌ర్డ్ వ‌ర్సిటీ త‌యారు చేస్తోన్న వ్యాక్సిన్ మంచి ఫ‌లితాలు ఇస్తాయ‌న్న న‌మ్మ‌కంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అనేక కోట్ల మంది ప్ర‌జ‌ల‌తో పాటు అన్ని దేశాలు దీనిపైనే ప్ర‌ధానంగా ఆశ‌లు పెట్టుకున్నాయి. ఇక ఆక్స్‌ఫ‌ర్డ్ వ‌ర్సిటీ త‌యారు చేసిన క‌రోనా వ్యాక్సిన్ భార‌త్‌కు వ‌చ్చేసింది.

 

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనికా ఈ వ్యాక్సిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ కోవిడ్ వ్యాక్సిన్‌పై మ‌న దేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ఔష‌ధ ప్ర‌యోగాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇక్క‌డ ఈ ప్ర‌యోగాలు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్‌కు కోవిషీల్డ్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. ఈ వ్యాక్సిన్‌పై పూణే, ముంబైల‌లో క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌ర‌పనున్నారు.

 

ఇక ఈ వ్యాక్సిన్‌ను ఇప్ప‌టికే యూకేలో మ‌నుష్యుల‌పై ప్ర‌యోగించ‌గా స‌క్సెస్ అయ్యింద‌ని అంటున్నారు. ఈ వ్యాక్సిన్ ఫ‌లితాల‌ను సైతం ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్‌’లో ప్రచురించారు. ఈ వ్యాక్సిన్ అత్యంత సుర‌క్షితం కావ‌డంతో పాటు దీని వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవ‌ని అంటున్నారు.

Leave a comment