ట్రంప్ మానసిక పరిస్థితిపై ఆందోళన..అసలేం జరుగుతోంది..?

ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు అంటే అలాంటిలాంటి విషయం కాదు. ఆర్ధికంగా, సైనిక శక్తి సామర్ధ్యాలు, టెక్నాలజీ ఇలా ఏ రంగంలో చూసుకున్నా అమెరికా టాప్ ప్లేస్ లో ఉంటూనే ఉంటుంది. మరే దేశం కూడా తనతో పోటీ పడకుండా పోటీ ప్రపంచంలో పరుగులు పెడుతూనే ఉంటుంది. అలాంటి అమెరికాకి అధ్యక్షుడు అంటే ఏ స్థాయిలో ఉండాలి, బుష్, ఒమాబా, బిల్ క్లింటన్, ఇలా ఎంతో మంది ఎంతో హుందాగా వ్యవహరిస్తూ అమెరికా కీర్తి ప్రతిష్టలకి భంగం కలుగకుండా కాపాడుకుంటూ వచ్చారు..కానీ ఈ సీన్ ట్రంప్ రాకతో పూర్తిగా మారిపోయింది..

 

ట్రంప్ అధ్యక్షుడు అయ్యింది మొదలు ప్రతీ విషయం వివాదాస్పదమే. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకునే ఉంటుంది. మాట్లాడే మాటల్లో నిజం మచ్చుక కూడా కనిపించదు. కీలకమైన నిర్ణయాలు సైతం మరుసరి రోజుకి మారిపోతూ ఉంటాయి. అందుకే ట్రంప్ అమెరికా చరిత్రలో ఓ కామెడీ, కన్ఫ్యూజన్ అధ్యక్షుడిగా మిగిలిపోయారు. రెండు రోజుల క్రితం ఎన్నికలను వాయిదా వేయాలని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన ట్రంప్ మళ్ళీ మాట మార్చారు తూచ్ నేను ఎన్నికలని వాయిదా వేయమని చెప్పలేదు అంటూ అదే ట్విట్టర్ వేదికగా తెలిపారు.

 

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ట్రంప్ ఇలాంటి వైఖరి ప్రదర్శించడంతో కార్యకర్తలు, రిపబ్లికన్ పార్టీ సైతం నివ్వెర పోతోంది. ఎన్నికలు వాయిదా వేయాలని ట్రంప్ అడిగిన సమయంలో యావత్ అమెరికా మొత్తం ట్రంప్ వైఖరిపై విరుచుకుపడింది, అంతేకాదు సొంత పార్టీ నేతలు, సీనియర్స్ సైతం ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ పరిస్థితులను గమనించిన ట్రంప్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఎన్నికలు రద్దు చేయండని కోరిన కొన్ని గంటల్లోగానే అలానేను అనలేదు… ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాను అంటూ ప్రకటించడంతో ట్రంప్ మానసిక పరిస్థితిపై అనుమానాలు మరింత వ్యక్తమవుతున్నాయి.

 

అసలు ట్రంప్ మైండ్ సరిగా ఉందా లేదా అనే ఆందోళన ఆయన అభిమానులు, రిపబ్లికన్ పార్టీ నేతలకి ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ట్రంప్ అభ్యర్దిగా రిపబ్లికన్ పార్టీ విజయాన్ని ఎలా అందుకోగలదు అంటూ సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారట.

Leave a comment