ఎన్టీఆర్‌తో రొమాన్స్‌కు సై అంటోన్న ఆ హాట్ హీరోయిన్‌..?

ప్ర‌స్తుతం తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో సెట్స్ మీద ఉన్న సినిమాల్లో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాపై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది… ముందుగా ఈ ఆర్ ఆర్ ఆర్ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8వ తేదీన రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే మ‌ళ్లీ ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సెట్స్ మీద‌కు వెళ్లిపోతారు.

 

త్రివిక్ర‌మ్ నుంచి అల వైకుఠ‌పురంలో సినిమా త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో పాటు ఎన్టీఆర్ నుంచి ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత వ‌చ్చే సినిమా కావ‌డంతో మంచి అంచ‌నాలు ఉన్నాయి. క‌రోనా కార‌ణంగా షూటింగ్‌లు అన్నీ క్యాన్సిల్ కావ‌డంతో ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ స్క్రిఫ్ట్ వ‌ర్క్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కోసం త్రివిక్ర‌మ్ అదిరిపోయే స్క్రిఫ్ట్ రెడీ చేస్తున్నాడ‌ట‌. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ట‌.

 

ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌లో మెయిన్‌ హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారు మేకర్స్. కుటుంబం, రాజ‌కీయ అంశాల‌తో తెర‌కెక్కే ఈ సినిమాలో మెయిన్ హీరోగా హాట్ భామ కియారా అద్వానీని ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమె ఇప్ప‌టికే తెలుగులో మ‌హేష్‌బాబు భ‌ర‌త్ అనే నేను, రామ్ చ‌ర‌ణ్ వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసేందుకు సై అంటోంద‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

Leave a comment