3 నెలల్లో సుశాంత్ నుంచి రియా ఎన్ని కోట్లో లాగేసిందంటే… క్రెడిట్ కార్డు లాక్కుని మ‌రీ…!

ధోని సినిమాతో సూప‌ర్ పాపుల‌ర్ అయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆ ఒక్క సినిమాతోనే దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. ఎంతో భ‌విష్య‌త్ ఉన్న ఈ యువ హీరో ఒక్క‌సారిగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో అనేకానేక సందేహాలు మోద‌లు అయ్యాయి. బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజంతో పాటు సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా వ్య‌వ‌హార శైలీతోనే అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ఇక ముంబై పోలీసులు ముందుగా ఈ కేసును లైట్ తీస్కొన్నా సుశాంత్ తండ్రి రియా తో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌పై ఎప్పుడు అయితే ఆరోప‌ణ‌లు చేస్తూ కేసు పెట్టాడో అప్ప‌టి నుంచి ఈ ఆత్మ‌హ‌త్య వెన‌క అనేక సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

 

పాట్నా పోలీసుల విచార‌ణ‌లో రియా సుశాంత్‌ను ఎలా మోసం చేసిందో వెల్ల‌డి అయిన‌ట్టుగా సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీనిపై జాతీయ మీడియాలో అనేక క‌థ‌నాలు కూడా వ‌స్తున్నాయి. ఆమె సుశాంత్ క్రెడిట్ కార్డు బ‌ల‌వంతంగా లాక్కుని మ‌రీ త‌న అవ‌స‌రాల‌కు వాడుకుంద‌ట‌. కేవ‌లం మూడు నెల‌ల్లోనే రు. 3 కోట్లు సుశాంత్ అక్కౌంట్ నుంచి రియా అక్కౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్టుగా పోలీసులు నిగ్గు తేల్చిన‌ట్టు జాతీయ మీడియా వార్త ప్రచురితం చేసింది. కేకే సింగ్ ఇప్పటికే 15 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసును పెట్టడం జరిగింది.

 

రియా త‌న ప్ర‌తి షాపింగ్‌కు సుశాంత్ క్రెడిట్ కార్డునే వాడింద‌న్న చ‌ర్చ‌లు కూడా వ‌స్తున్నాయి. ఇక పాట్నా పోలీసులు రియాతో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల అక్కౌంట్ల వివ‌రాల‌తో పాటు క్రెడిట్ కార్డులు, ఇత‌ర ఖాతాల వివ‌రాలు కూడా కూపీ లాగుతున్నార‌ట‌. రియా సుశాంత్‌ను ప్రేమ‌తో న‌మ్మించి మోసం చేయ‌డం వ‌ల్లే .. ఆర్థికంగా దెబ్బ‌తీయ‌డం వ‌ల్లే మాన‌సిక క్షోభ‌తో అత‌డు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటార‌ని అత‌డి అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a comment