బ్రేకింగ్‌: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు క‌రోనా… వాళ్ల‌కు కూడా షాకే…!

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. కొద్ది రోజులుగా దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం చోటు చేసుకుంటోంది. ఇప్ప‌టికే మ‌న దేశంలో కరోనా కేసులు ఏకంగా 17 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. క‌రోనా మ‌ర‌ణాలు కూడా 37 వేలు దాటేశాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే మ‌న దేశంలో రోజుకు క‌రోనా కేసులు ఏకంగా 70 వేల‌కు చేరువ‌లో ఉన్నాయి. క‌రోనా సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రిని తీవ్రంగా క‌ల‌వ‌ర పెడుతోంది. తాజాగా ప్ర‌ధాన‌మంత్రి మోదీ త‌ర్వాత నెంబ‌ర్ 2 పొజిష‌న్‌లో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా కరోనా వైరస్ సోకింది.

 

ఈ విష‌యంపై ఎలాంటి ఆందోళ‌న‌లు లేకుండా ఆయ‌నే స్వ‌యంగా త‌న‌కు క‌రోనా సోకింద‌ని.. తాను చికిత్స కోసం ఆసుప‌త్రిలో చేరాన‌ని ట్వీట్ చేశారు. క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో తాను ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని.. ఇక గ‌త కొద్ది రోజులుగా త‌న‌తో పాటు క‌ల‌సి తిరిగిన వారు సైతం క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. ఇక ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేసుకోవాలని.. అందరూ హోం ఐసోలేషన్ లో ఉండాలని అమిత్ షా కోరారు. దీంతో కొద్ది రోజులుగా అమిత్ షాను క‌లిసిన వారిలో ఇప్పుడు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Leave a comment