ఏపీలో క‌రోనా నిల‌యంగా మారిన ఆ జైలు… క‌రోనాతో ఖైదీలంద‌రూ విల‌విల‌..!

ఏపీలోని నెల్లూరు జిల్లాలోని కారాగారంలో ఖైదీలు అంద‌రూ క‌రోనాతో విల‌విల్లాడుతున్నారు. జైలులో కొత్త‌గా 20 మంది ఖైదీల‌కు క‌రోనా సోక‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా సోకిన ఖైదీల సంఖ్య 72కు చేరుకుంది. గత కొద్ది రోజులుగా ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి ఎంత‌లా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఏపీలో 1,50,209 క‌రోనా కేసులు ఉన్నాయి. ఇందులో 72,188 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు 1407 మంది మృతి చెందారు.

 

ఇక ఏపీలో కీల‌క కారాగారాల్లో ఒక‌టి అయిన రాజ‌మండ్రి సెంట్ర‌ల్లో జైల్లో కూడా ప‌లువురు ఖైదీలు క‌రోనా భారీన ప‌డ్డారు. ఇక ఇప్పుడు నెల్లూరు జిల్లా కారాగారంలో కొత్తగా మరో 20 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్ప‌టికే అక్క‌డ కొంత మంది ఖైదీల‌కు క‌రోనా సోక‌గా ఈ టోట‌ల్ కౌంట్ 72కు చేరుకుంది. ఈ జైలులో ఉన్న వారిలో పలువురికి క‌రోనా ఉన్న‌ట్టు అనుమానం రావ‌డంతో రెండు రోజుల పాటు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

 

మొదటి రోజు నిర్వహించిన పరీక్షల్లో 52 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో మిగతా వారికి రెండో రోజు చేసిన పరీక్షల్లో 20 మందికి కరోనా ఉన్నట్లు గుర్తించారని జైలు సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు చెప్పారు. కరోనా సోకిన వారికి ప్రత్యేక ఐసోలేషన్‌ గదులు కేటాయించినట్లు చెప్పారు. జైలులోని అన్ని గదులను శానటైజేషన్‌ చేయించినట్లు జైలు అధికారులు చెప్పారు.

Leave a comment