Gossipsఆదిపురుష్‌లో సీత రోల్లో మ‌హేష్ హీరోయిన్‌

ఆదిపురుష్‌లో సీత రోల్లో మ‌హేష్ హీరోయిన్‌

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ రాముడిగా ఆదిపురుష్ సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి దేశ‌వ్యాప్తంగా ఈ భారీ ప్రాజెక్టుపై భారీ ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఈ సినిమాలో ఒక్కో పాత్ర‌కు ఓం రౌత్ న‌టీన‌టుల‌ను ఎంపిక చేస్తూ వ‌స్తున్నారు. రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు పోటీగా ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో సైఫ్ ఆలీఖాన్ పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. ఇక పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అన్ని భాష‌ల న‌టీన‌టులు ఉన్నా… బాలీవుడ్ న‌టుల‌నే ఎక్కువుగా తీసుకుంటున్నారు.

ఇక శివ‌గామి ర‌మ్య‌కృష్ణ సైతం ఓ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. ఇక  ఈ సినిమాలో కీల‌క‌మైన సీతాదేవి పాత్ర కోసం బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కైరా అద్వానీ పేరు ప‌రిశీలిస్తున్నార‌ని టాక్‌. ఆమె తెలుగులో కూడా మ‌హేష్‌బాబు భ‌ర‌త్ అనే నేను సినిమాతో పరిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత విన‌య విధేయ రామలో కూడా చ‌ర‌ణ్ ప‌క్క‌న చేసింది. ఆమె ఆంద‌మైన రూపం, ఎత్తు ఇవ‌న్నీ ఆమె సీతాదేవి పాత్ర‌కు ప‌ర్‌ఫెక్ట్ అని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ భావిస్తున్నార‌ట‌.

ఇక ఆమెకు సౌత్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె సీతాదేవి రోల్ చేస్తే బాలీవుడ్‌లోనూ క్రేజ్ ఉంటుంది. ఇవ‌న్నీ ఆలోచించే ఆమె పేరు ఈ పాత్ర కోసం ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఆమె మోడ్ర‌న్ రోల్స్‌కు ఎంత ఫిట్‌గా ఉంటుందో.. ట్రెడిష‌న‌ల్ లుక్‌లో కూడా సూప‌రే. ఇక నాగ్ అశ్విన్ – ప్ర‌భాస్ సినిమాలో దీపికా ప‌డుకొనే సెట్ అవుతుంద‌న్న విష‌యం ప‌ద్మావ‌త్ చూశాక అర్థ‌మైంది. ఇక ఇప్పుడు ఆదిపురుష్‌లో వ‌రుస‌గా ఛాన్స్ ఇస్తే బాగోద‌నే కైరా పేరు ప‌రిశీలిస్తున్నార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news