Moviesడ‌బ్బుల్లేవ‌న్న రియా క‌ళ్లు చెదిరేలా లాయ‌ర్ ఫీజు ఇస్తోందా.. ఈ డ‌బ్బులెక్క‌డివి...?

డ‌బ్బుల్లేవ‌న్న రియా క‌ళ్లు చెదిరేలా లాయ‌ర్ ఫీజు ఇస్తోందా.. ఈ డ‌బ్బులెక్క‌డివి…?

దివంగ‌త న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ముందునుంచి అనేక సందేహాలు లేవ‌నెత్తుతోంది. ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తోంది. ఈ కేసులో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కు కూడా లింక్ ఉంద‌ని ఆమె ముందు నుంచి నెత్తినోరూ కొట్టుకుంటోంది. బాలీవుడ్లో ఉన్న నెపొటిజం మాఫియా కారణంగానే సుశాంత్ చనిపోయాడని ఆరోపించింది.

 

తాజాగా ఆమె రియా చ‌క్ర‌వ‌ర్తిపై షాకింగ్ కామెంట్లు చేసింది. తాను ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో కేసులు ఎదుర్కొన్నాన‌ని.. లాయ‌ర్ల‌ను స‌మ‌కూర్చుకోవ‌డం ఎంత ఖ‌ర్చుతో కూడుకున్న‌దో నాకు తెలుస‌న్న ఆమె… ఇంత త‌క్కువ స‌మ‌యంలోనే సుశాంత్ కేసులో రియాకు స‌తీష్ లాంటి పెద్ద లాయ‌ర్ ఎక్క‌డ నుంచి వ‌చ్చాడ‌ని ఆమె ప్ర‌శ్నించింది. ఇటీవ‌ల రియా త‌న ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవ‌ని చెప్పింద‌ని.. మ‌రి స‌తీష్ లాంటి పెద్ద లాయ‌ర్‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు ఆమెకు డ‌బ్బులు ఎక్క‌డ నుంచి వ‌స్తున్నాయ‌ని ప్ర‌శ్నించింది.

 

ఈ కేసులో చాలా మంది పెద్దోళ్లు ఉన్నారు అనేందుకు ఇది ప‌క్కా నిద‌ర్శ‌నం అని కూడా ఆమె చెప్పింది. ఇక ఈ విష‌యంపై రియాపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఇక సీబీఐ సైతం ఆమెను విచారించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కంగనా గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ కేసుకు సంబంధించి తన వద్ద కీలక సమాచారం ఉందని చెప్పింది. కనుక సీబీఐ వారు కంగనాను కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news