Gossipsబాల‌య్య‌పై జూనియ‌ర్ ప్రెజ‌ర్ ఎక్కువైందా...!

బాల‌య్య‌పై జూనియ‌ర్ ప్రెజ‌ర్ ఎక్కువైందా…!

టాలీవుడ్‌లో నంద‌మూరి ఫ్యామిలీ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ఫ్యామిలీ హీరోల సినిమా వ‌స్తుందంటే నంద‌మూరి అభిమానులు ఎంత హంగామా చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే నంద‌మూరి అభిమానులకు మాత్రం ఓ కోరిక తీర‌కుండా అలాగే ఉంది. అందే నంద‌మూరి హీరోల మ‌ల్టీస్టార‌ర్‌. ప్ర‌స్తుతం నంద‌మూరి హీరోల్లో బాల‌కృష్ణ‌తో పాటు అన్న‌ద‌మ్ములు ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ సినిమాలు చేస్తున్నారు. వీరి ముగ్గురు కాంబినేష‌న్లో సినిమా కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిటింగ్‌లో ఉన్నారు.

అక్కినేని మ‌నం వ‌చ్చాక ఈ చ‌ర్చ‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయి. ఇక మేన‌మామ‌, మేన‌ల్లుడు వెంకీ, చైతు కూడా వెంకీమామ చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురు నంద‌మూరి అభిమానులు కూడా కలిసి సినిమా చేయాల‌ని తెలుగు సినిమా అభిమానులు కోరుతున్నారు. ఈ విష‌యంలో క‌ళ్యాణ్‌రామ్‌కు ఇబ్బంది ఉండ‌దు. ఇక ఎన్టీఆర్ కూడా స‌రైన క‌థ ఉంటే మ‌ల్టీస్టార‌ర్‌కు తాను సిద్ధ‌మే అన్న సంకేతాలు త‌న అనుచ‌రుల ద్వారా పంపుతున్నారు. బాబాయ్‌తో క‌లిసి న‌టించేందుకు ఎన్టీఆర్ ఎప్పుడూ రెడీయే అని ఎన్టీఆర్ స‌న్నిహితులు కూడా చెపుతున్నారు.

ఇప్పుడు బాల‌య్య తీసుకునే నిర్ణ‌యం మీదే నంద‌మూరి కుటుంబం మ‌ల్టీస్టార‌ర్ వ‌స్తుందా ?  లేదా ? అన్న‌ది ఆధార‌ప‌డి ఉంది. నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ ఇద్ద‌రూ మ‌ల్టీస్టార‌ర్ విష‌యంలో రెడీగానే ఉన్నారు. ఈ విష‌యంలో బాల‌య్య‌పైనే ఒత్తిడి ఉంద‌ని నంద‌మూరి అభిమానులు అంటున్నారు. బాల‌య్య కూడా మ‌ల్టీస్టార‌ర్‌కు ఓకే అంటే నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్‌కు ముందు అడుగు ప‌డిన‌ట్టే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news