ఆర్ఆర్ఆర్‌తో పోటీకి సై అంటోన్న పవన్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతోంది. అయితే ఆర్ఆర్ఆర్‌తో పోటీకి ఓ సినిమా వస్తుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ మూవీతో పోటికి సై అంటోంది మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును.. పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ మూవీగా రానున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో పవన్ నటించబోయే ఈ సినిమాను 2021 సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అంటే జనవరి 8న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుండగా, సంక్రాంతి బరిలో పవన్ సినిమా వస్తుందన్నమాట.

ఒకవేళ ఇదే నిజమైతే, బాక్సాఫీస్ వద్ద మరో బిగ్గెస్ట్ ఫైట్‌ తప్పదని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి అంటున్నారు సినీ ప్రేమికులు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ మూవీతో పవన్ పోటీ చేస్తాడా లేడా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.