పవన్ సినిమాలో ఆమెనే హైలైట్.. పాపం ఫ్యాన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో పవర్ స్టార్ మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇక పవన్ రీఎంట్రీ కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉండేలా చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. బాలీవుడ్‌లో సూపర్ సక్సె్స్ అయిన పింక్ చిత్రాన్ని తెలుగు రీమేక్‌గా వకీల్ సాబ్ వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ పాత్రలో నివేదా థామస్, అంజలి నిటిస్తున్నారు. పింక్ చిత్రంలో తాప్సీ పాత్ర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వకీల్ సాబ్ చిత్రంలోనూ నివేదా థామస్ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆమె యాక్టింగ్‌కు పవన్ కూడా ఫిదా అయినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఎమోషనల్ సీన్స్‌లో నివేదా పర్ఫార్మెన్స్‌కు చిత్ర యూనిట్ షాక్ అయ్యారట.

ఇక ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.