వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీరిలీజ్ బిజినెస్.. రౌడీ టార్గెట్ బాగానే ఉందిగా!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు ఏర్పడటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ ఏకంగా నలుగురు బ్యూటీలతో రొమాన్స్ చేస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు కుర్రకారు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను బయ్యర్లు భారీ రేటుకు కొన్నారు. దీంతో ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఇట్టే అర్ధమవుతోంది. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.30.50 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయడంతో ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌లో రెండో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది.

విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, కేథరిన్ త్రేసా, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై వళ్లభ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక ఏరియాలవారీగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 9.00 కోట్లు
సీడెడ్ – 4.00 కోట్లు
ఆంధ్రా – 10.00 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 23.00 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 4.00 కోట్లు
ఓవర్సీస్ – 3.50 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ బిజినెస్ – 30.50 కోట్లు

Leave a comment