అటు ఇటు తిరుగుతున్న ఫ్లాప్ హీరో.. చివరకు అలా వస్తాడట

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. తన కెరీర్‌లో మంచి పాత్రలు చేసిన రాజ్ తరుణ్ కొద్ది సమయంలోనే లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఎంత తక్కువ సమయంలో ఈ హీరో తన సత్తా చాటాడో, అంతే తక్కువ సమయంలో ఫేడవుట్ కూడా అయ్యాడు. వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టిన ఈ హీరో ప్రస్తుతం తన ఆశలన్నీ ‘ఒరేయ్ బుజ్జిగా’ అనే సినిమాపై పెట్టుకున్నాడు.

ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి ఇద్దరి లోకం ఒక్కటే అనే సినిమాతో మనముందుకు వచ్చిన రాజ్ తరుణ్, ఆ సినిమాతోనూ నిరాశపరిచాడు. ఇక ప్రస్తుతం గుండె జారి గల్లంతయ్యిందే ఫేం డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్‌లో ఒరేయ్ బుజ్జిగా సినిమాను చేసిన రాజ్ తరుణ్ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా అటు ఇటు తిరుగుతున్నాడు. తొలుత ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోండగా అందాల భామ హెబ్బా పటేల్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

Leave a comment