అల వైకుంఠపురములో 22 డేస్ కలెక్షన్స్.. ఎంతంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో సినిమా అల వైకుంఠపురములో సంక్రాంతి బరిలో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్ల వద్ద పడిగాపులు కాచారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుండీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లు రాబడుతూ దూసుకెళుతుండగా, ఆల్‌టైం ఇండస్ట్రీ హిట్‌గా ఈ సినిమా నిలిచింది.

బన్నీ యాక్టింగ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ టేకింగ్‌కు జనాలు ఫిదా కావడంతో పాటు థమన్ సంగీతం ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా నిలిచింది. ఈ సినిమాను చూసిన వారు కూడా మళ్లీ చూస్తుండటంతో చిత్ర కలెక్షన్లు ఏమాత్రం జోరు తగ్గడం లేదు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 22 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.155.99 కోట్ల మేర వసూళ్లు సాధించింది.

అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 22 రోజుల కలెక్షన్లు
నైజాం – 42.7 కోట్లు
సీడెడ్ – 18.1 కోట్లు
గుంటూరు – 10.5 కోట్లు
ఉత్తరాంధ్ర – 20.02 కోట్లు
ఈస్ట్ – 11.1 కోట్లు
వెస్ట్ – 8.5 కోట్లు
కృష్ణా – 10.25 కోట్లు
నెల్లూరు – 4.3 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 125.67 కోట్లు
కర్ణాటక – 8.96 కోట్లు
కేరళ – 1.23 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2.13 కోట్లు
ఓవర్సీస్ – 18.02 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – 155.99 కోట్లు

Leave a comment