సరిలేరు నీకెవ్వరు 23 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్లు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ కూడా ఇవ్వడంతో సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఎక్కడలేని బజ్ వచ్చి పడింది.

దీనికి తోడు ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించామంటూ చిత్ర యూనిట్ మొదట్నుండీ చెప్పడంతో ఈ సినిమాను చూసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు పోటీ పడ్డారు. ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా సరిలేరు నీకెవ్వరు అంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా పలు కొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. మహేష్ కెరీర‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందంటే సరిలేరు నీకెవ్వరు ఎలాంటి వసూళ్లు సాధించిందో ఇట్టే చెప్పేయొచ్చు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 23 రోజులు దాటినా థియేటర్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. ఈ సినిమా ప్రపంచవ్యప్తంగా ఏకంగా రూ.141.56 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 23 రోజుల కెలక్షన్లు
నైజాం – 39.4 కోట్లు
సీడెడ్ – 16.20 కోట్లు
గుంటూరు – 9.78 కోట్లు
ఉత్తరాంధ్ర – 20.12 కోట్లు
ఈస్ట్ – 11.13 కోట్లు
వెస్ట్ – 7.34 కోట్లు
కృష్ణా – 8.74 కోట్లు
నెల్లూరు – 4.08 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 116.79 కోట్లు
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 11.97 కోట్లు
ఓవర్సీస్ – 12.8 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – 141.56 కోట్లు

Leave a comment