బన్నీకి చుక్కలు చూపించిన మహేష్.. కేరళలో రికార్డుల మోత

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా మరికొద్ది గంటల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మహేష్ బాబు సరికొత్త రికార్డు క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన మార్క్‌ను వదిలేందుకు రెడీ అయ్యాడు మహేష్. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ బన్నీ అడ్డాలో తన పాగా వేసేందుకు రెడీ అయ్యాడు మహష్ బాబు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు కేరళలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బన్నీ ప్రతి సినిమాను అక్కడ ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది బన్నీ అడ్డాలో మహేష్ పాగా వేశాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ఏకంగా 30 సెంటర్లలో రిలీజ్ చేస్తూ కేరళలో తెలుగు హీరోల రికార్డులను పాతర వేశాడు మహేష్. ఇప్పటివరకు ఈ స్థాయిలో ఏ తెలుగు హీరో సినిమా రిలీజ్ కాలేదంటే మహేష్ స్టామినా ఏమిటో అర్ధం చేసుకోండి.

ఇక కొచ్చిలో ఉదయం 6.30కే మొదటి షోతో ప్రభంజనం సృష్టించేందుకు మహేష్ రెడీ అయ్యాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా డైరెక్ట్ చేస్తుండగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తోంది. మరి రేపు రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a comment