దర్బార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ములేపిన రజినీ

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం దర్బార్ నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో తొలిరోజు ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంచనాలు వేశాయి. ఈ సినిమాతో రజినీకాంత్ స్టామినా ఏమిటో ప్రేక్షకులకు మరోసారి తెలుస్తోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశాయి.

అనుకున్నట్లుగానే దర్బార్ చిత్రం రిలీజ్ రోజున మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులోనూ రజినీకి మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ సినిమాకు తొలిరోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.4.41 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ కలెక్షన్లు రెండో రోజు పెరిగే అవకాశం మెండుగా ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఏరియాలవారీగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ డే కలెక్షన్లు
నైజాం – 2.03
సీడెడ్ – 0.66
నెల్లూరు – 0.18
కృష్ణా – 0.24
గుంటూరు – 0.40
వైజాగ్ – 0.44
ఈస్ట్ – 0.28
వెస్ట్ – 0.18
టోటల్ ఏపీ+తెలంగాణ – 4.41 కోట్లు

Leave a comment