Moviesరవితేజ డిస్కో రాజా మూవీ రివ్యూ & రేటింగ్

రవితేజ డిస్కో రాజా మూవీ రివ్యూ & రేటింగ్

సినిమా: డిస్కో రాజా
నటీనటులు: రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నటా నభేష్, బాబీ సింహా తదితరులు
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
మ్యూజిక్: థమన్
నిర్మాత : రామ్ తాళ్లూరి
దర్శకత్వం : విఐ ఆనంద్
రిలీజ్ డేట్: 24-01-2020

మాస్‌రాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం డిస్కో రాజా మంచి అంచనాల నడుమ నేడు ప్రపంచవ్యప్తంగా రిలీజ్ అవుతుంది. రెగులర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తుండటం, పోస్టర్స్, టీజర్స్ బాగుండటంతో ఈ సినిమాపై జనాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాగా తరకెక్కిన డిస్కో రాజా మరి ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథ:
రవితేజపై హత్యా ప్రయత్నం జరగడంతో అతడి బాడీని లడాఖ్‌లోని ఓ లేబరోటరీలో భద్రపరుస్తారు. అతడి బాడీలో తిరిగి ప్రాణం పోసేందుకు సైంటిస్టులు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో అనేక ప్రయత్నాల తరువాత రవితేజకు తిరిగి ప్రాణం పోస్తారు. ఈ విషయం తెలుసుకున్న విలన్ బాబీ సింహా గ్యాంగ్ రవితేజ కోసం వెతుకుతుంటారు. కాగా రవితేజ ఆ లేబరోటరీ నుండి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కట్ చేస్తే ఓ భారీ దొంగతనం విషయంలో రవితేజ మోస్ట్ వాంటెడ్ దొంగ అని సైంటిస్టులు గుర్తిస్తారు. ఇంతకీ రవితేజ గతం ఏమిటి..? బాబీ సింహా అండ్ గ్యాంగ్ రవితేజను ఎందుకు వెతుకుతున్నారు..? వారికి రవితేజకు ఏం సంబంధం ఉంది..? అనేది సినిమా స్టోరీ.

విశ్లేషణ:
మాస్ రాజా రవితేజ వరుస ఫెయిల్యూర్స్‌తో సమతమవుతుండటంతో ఔట్ ఆఫ్ ది బాక్స్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా చిత్రంలో నటించాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్న రవితేజ చిత్రంలో ఓ విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక కథనం విషయానికి వస్తే రవితేజపై హత్యాప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలో అతడికి తిరిగి ప్రాణం పోయాలని సైంటిస్టులు ప్రయత్ని్స్తుంటారు. అనేక ప్రయత్నాల తరువాత రవితేజకు తిరిగి ప్రాణం పోస్తారు. ఈ క్రమంలో అతడికి సంబంధించిన గతం గురించి తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తారు.

కట్ చేస్తే.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఢిల్లీలో ఉండే రవితేజ నభా నటేష్‌ను ప్రేమిస్తాడు. అయితే రవితేజపై సీక్రెట్ విచారణ చేస్తున్న నరేష్‌కు అతడి గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. కాగా బాబీ సింహా ఓ కిడ్నాప్‌కు సంబంధించి రవితేజను కలుస్తాడు. దీంతో వారిద్దరి మధ్య కొన్ని సీరియస్ సన్నివేశాలు జరుగుతాయి. కట్ చేస్తే.. ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుటుంది. ఫస్టాఫ్‌లో రవితేజపై హత్య ప్రయత్నం, దాని వెనుక ఉన్న సీక్వెన్సులను దర్శకుడు బాగానే హ్యాండిల్ చేశాడు. కాగా ఫ్లాష్ బ్యాక్‌లో రవితేజ అండ్ గ్యాంగ్ చేసే కామెడీ, నభాతో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇక సెకండాఫ్‌లో రవితేజ, సునీల్‌తో కలిసి చేసే దొంగతనాల గురించి చూపించారు. ఈ క్రమంలో వారు ఓ బ్యాంకు‌ రాబరీకి ప్లాన్ చేస్తారు. కట్ చేస్తే ఓ విషయంలో బాబీ సింహాతో గొడవ పడ్డ రవితేజ అతడి వ్యాపారాలను అడ్డుకుంటాడు. ఈ క్రమంలో పాయల్ రాజ్‌పుత్‌ను చూసి ప్రేమిస్తాడు రవితేజ. కట్ చేస్తే.. డిస్కో రాజాను వెతుక్కుంటూ లడాఖ్ చేరుకుంటాడు బాబీ సింహా. ఈ క్రమంలో ప్రీక్లైమాక్స్‌లోని యాక్షన్ సీన్స్‌ను బాగా తెరకెక్కించారు. ఇక ఓ అదిరిపోయే ట్విస్టుతో వచ్చే క్లైమాక్స్ సీన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఓవరాల్‌గా చూస్తే, సైన్స్ ఫిక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా అటు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాతో రవితేజ మరోసారి మాస్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. విఐ ఆనంద్ ఎంచుకున్న కథనం బాగున్నా అది కొన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించకపోవచ్చు.

నటీనటులు పర్ఫార్మెన్స్:
డిస్కో రాజా పాత్రలో రవితేజ చాలా ఎనర్జిటిక్‌గా నటించారు. తనదైన మార్క్‌ ఎలివేషన్‌లతో ప్రేక్షకులను అలరించాడు. కామెడీ టైమింగ్‌లో తనకు తానే సాటి అంటూ మరోసారి నిరూపించుకున్నాడు. ఇక విలన్ పాత్రలో నటించిన బాబీ సింహా ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రలో నటించిమెప్పించాడు. ఆయన డైలాగ్ మాడ్యులేషన్ సూపర్. ఇక హీరోయిన్లుగా పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్‌లు బాగానే ఆకట్టుకున్నారు. కమెడియన్ పాత్రల్లో సునీల్ అండ్ గ్యాంగ్ ప్రేక్షకులను నవ్వించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు విఐ ఆనంద్ ఎంచుకున్న కథనం రొటీన్ సినిమాలకు విభిన్నంగా ఉంది. అయినా కొన్ని చోట్ల సినిమా సాగతీతగా అనిపించింది. హీరో ఎలివేషన్ సీన్లను అదిరిపోయే రేంజ్‌లో చూపించాడు. సినిమాటోగ్రఫీ పనితనం సూపర్‌గా ఉంది. థమన్ అందించిన సంగీతం బాగుంది. ఫ్రీక్ ఔట్ పాట వచ్చినప్పుడు థియేటర్లలో సందడి నెలకొంది. బీజీఎం కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను రిచ్ లుక్‌లో చూపించారు.

చివరగా:
డిస్కో రాజా – అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి రాజా!

రేటింగ్:
2.5/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news