సోలోగా దిగిన బాబు.. గుంపుగా వస్తున్న బన్నీ బ్యాచ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అత్యంత భారీ హైప్ క్రియేట్ కావడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. అటు కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం గ్యారెంటీ అంటున్నారు.

అయితే ఒక్క రోజు తేడాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సినిమాపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో క్లా్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం ఖాయం. కానీ మాస్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ మరో ఇద్దరు స్టార్ హీరోలను వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లకు ఈ సినిమా స్పెషల్ షో వేసి వారితో ఈ సినిమాను ప్రమోట్ చేయించాలని చూస్తున్నారు అల వైకుంఠపురం టీమ్. ఏదేమైనా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మాస్ వర్గాల నుంచి ఫుల్ రెస్పాన్స్ రావడంతో అల వైకుంఠపురములో చిత్ర యూనిట్ ఈ ప్లాన్ వేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి వారి ప్లాన్ ఎంతమేర పనిచేస్తుందో చూడాలి.

Leave a comment