బాలయ్య టైటిల్ పాత్రలో బన్నీ.. ఫ్యాన్స్‌ను ఖుషే చేస్తానంటున్న సుక్కు

స్టైలిష్ స్టా్ర్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బన్నీ రెడీ అయ్యాడని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో చేయనున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాను ప్రారంభించిన బన్నీ ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశాడు. కాగా ఈ సినిమాలో బన్నీ పాత్ర ఏమిటనే విషయంపై సోషల్ మీడియాలో పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీ ఓ స్మగ్లర్‌గా కనిపిస్తాడనే వార్త జోరుగా ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కాగా తాజాగా ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. దీని కోసం తన లుక్‌ను కూడా చాలా రఫ్‌గా మార్చుకుంటున్నాడట బన్నీ.

సుకుమార్ సినిమా అంటేనే హీరో గెటప్ పూర్తిగా మారిపోవాల్సిందే. అలాంటిది బన్నీ రఫ్‌ లుక్‌లో ఎలా కనిపిస్తాడా అని బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే గతంలో లారీ డ్రైవర్ అనే టైటిల్‌తో బాలయ్య సినిమా ఎలాంటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. మరి అలాంటి టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న బన్నీ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Leave a comment