పెళ్లిలో కుంపటి.. ఫిదా అయిన బంధువులు

నూతన జీవితానికి నాంది పలుకుతూ ఇద్దరు మనుష్యులు ఒకటయ్యే పెళ్లి వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ చూస్తారు. తమ వివాహ వేడుకకు తమ బంధువలందరినీ పిలిచి వారికి తగు మర్యాదలు చేసి పంపుతారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి లోటు రాకుండా చూడాలని తెగ ఆరాట పడుతుంటారు. కానీ ఓ పెళ్లి వేడుకలో బంధువుల కోసం పెళ్లివారు ఏకంగా కుంపటి పెట్టారు.

ఇదేదో మాటవరసకు కాదు.. నిజంగానే వారు తమ పెళ్లిలో కుంపటి పెట్టారు. అసలే చలికాలం కావడంతో వచ్చిన బంధువులు ఎక్కడ చలికి భయపడి వెళ్లిపోతారో అని భయపడ్డారు ఆ పెళ్లివారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ పెళ్లి వారు తమ ఇంటికి వచ్చిన బంధువులు చలికి తొందరగా తిని, రగ్గులోకి దూరి తుంగోకుండా జాగ్రత్త పడ్డారు. తమ బంధువులకు వెచ్చటి చలిమంటను ఏర్పాటు చేశారు.

రాత్రిపూట పెళ్లి కావడంతో చుట్టాలు ఎక్కడికక్కడ ముడుచుకుని నిద్రపోతారేమోనని పెళ్లి వారు ఇలాంటి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా ఈ పెళ్లిలో కుంపటి తమకు బాగా నచ్చిందని, పెళ్లివారి ఏర్పాట్లు బాగున్నాయని వచ్చిన బంధువులు తెలిపారు. ఏదేమైనా ఈ వివాహ వేడుక స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a comment