అల వైకుంఠపురములో 5 రోజుల కలెక్షన్ల్స్.. బన్నీయా మజాకా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.

కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అటు సరిలేరు నీకెవ్వరు సినిమా గట్టి పోటీ ఇస్తున్నా, త్రివిక్రమ్ మార్క్ మూవీ కావడంతో ఈ సినిమాకు జనం ఫిదా అవుతున్నారు. ఈ సినిమా 5 రోజులు ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.70.72 కోట్లు సాధించింది. ఓవర్సీస్‌లో సైతం ఈ సినిమా కోసం జనాలు ఎగబడుతున్నారు.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 5 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 5 రోజుల కలెక్షన్లు
నైజాం – 22.53 కోట్లు
సీడెడ్ – 11.02 కోట్లు
నెల్లూరు – 2.62 కోట్లు
కృష్ణా – 6.66 కోట్లు
గుంటూరు – 6.76 కోట్లు
వైజాగ్ – 9.45 కోట్లు
ఈస్ట్ – 6.59 కోట్లు
వెస్ట్ – 5.09 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.70.72 కోట్లు

Leave a comment