Moviesప్రతిరోజూ పండగే 5 రోజుల కలెక్షన్లు

ప్రతిరోజూ పండగే 5 రోజుల కలెక్షన్లు

మెగా కాంపౌండ్ నుండి వచ్చి సుప్రీం హీరోగా మారిన సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్లు లేక తేజు వెనకబడిపోయాడు. తాజాగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలో నటించిన తేజు ఈ సినిమాతో ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు.

ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరెకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చడంతో సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 రోజులు ముగిసే సరికి రూ.12.55 కోట్లు రాబట్టింది. మరి ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 5 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 5.37 కోట్లు
సీడెడ్ – 1.52 కోట్లు
నెల్లూరు – 0.43 కోట్లు
కృష్ణా – 0.87 కోట్లు
గుంటూరు – 0.87 కోట్లు
వైజాగ్ – 1.88 కోట్లు
ఈస్ట్ – 0.92 కోట్లు
వెస్ట్ – 0.69 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 12.55 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news