Moviesఅదా డ్యాన్స్‌కు జనం ఫిదా

అదా డ్యాన్స్‌కు జనం ఫిదా

తెలుగులో హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అందాల భామ అదా శర్మ ఆ తరువాత పలు సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో గుర్తింపు సాధించలేకపోయింది. అందం, అభినయం రెండూ ఉన్నా ఆమెకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు. దీంతో అమ్మడు బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ కూడా అమ్మడికి ఛాన్సులు అంతంత మాత్రంగా రావడంతో సినిమాలు అడపాదడపా చేస్తోంది.

అయినా సోషల్ మీడియాలో మాత్రం అదా శర్మ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్‌లతో ప్రేక్షకులకు కిక్కిస్తోంది. ఇక తాజాగా క్రిస్మస్ సందర్భంగా అదా శర్మ ఓ వినూత్న డ్యాన్స్ స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటోంది. జింగిల్ బెల్స్ పాటకు కథక్ డ్యాన్స్ స్టెప్పులతో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. అదా శర్మ అందంతో పాటు ఆమె వేసిన స్టెప్పులకు జనం ఫిదా అవుతున్నారు. ఇలాంటి ట్యాలెంట్ ఉన్న హీరోయిన్లకు అవకాశాలు మరిన్ని రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. ఏదేమైనా అదా చేసిన డ్యాన్స్ స్టెప్పులకు నెటిజన్లు మాత్రం ఫిదా అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news