ఆల్‌టైం రికార్డు సృష్టించిన ఆర్ఆర్ఆర్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తు్న్న తాజా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ వ్యవహారం అప్పుడే మొదలైంది. ఈ అంశంలో ఆర్ఆర్ఆర్ తాజాగా ఓ ఆల్‌టైం రికార్డును కూడా సృష్టించింది.

ఆర్ఆర్ఆర్ చిత్రం పశ్చిమ గోదావరి హక్కులను గీత మరియు షణ్ముఖ ఫిలింస్ సంస్థ సంయుక్తంగా రూ.13 కోట్లకు కొనుగోలు చేశాయి. ఈ ప్రాంతంలో ఓ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఇంతటి స్థాయిలో జరగడం ఇదే ప్రథమం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా హక్కులను ఇంతటి భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు.

ఇక రాజమౌళి ఈ సినిమాకు ఎలాంటి విజయాన్ని అందిస్తాడో అది అందరికీ తెలిసిందే అంటున్నారు అభిమానులు. నందమూరి, మెగా ఫ్యాన్స్‌కు కలిపి ఒకేసారి డబుల్ ధమాకా ఇచ్చేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాను జూలై 30, 2020లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a comment