హీరోలకు బొమ్మ చూపిస్తున్న ఉపేంద్ర.. ఏకంగా ఏడు!

స్టార్ హీరోల సినిమాలు అంటే ఒకటి లేదా రెండు భాషల్లో రిలీజ్ చేయడం మనకు తెలుసు. దర్శకధీరుడు రాజమౌళి పుణ్యమా అని ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటూ పలు భాషల్లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అయితే వీరెవ్వరూ చేయని సాహసం చేస్తున్నాడు ఓ హీరో.

శాండల్‌వుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న స్టార్ హీరో ఉపేంద్ర తాజాగా కబ్జా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది తన కెరీర్‌లోనే అత్యంత బిగ్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోండగా దీన్ని ఏకకాలంలో ఏడు భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కన్నడతో పాటు ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ మరియు బెంగాలీ భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.

ఇలా స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని ఫీట్‌ను ఉపేంద్ర చేస్తుండటంతో యావత్ సినీ లోకం ఆయన సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను చంద్రు డైరెక్ట్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a comment