సాహోను మించిపోయిన సైరా…!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా అంటే అభిమానుల్లో, ప్రేక్ష‌కుల్లో ఎంతో క్రేజ్ ఉంటుంది.. చిరంజీవి సినిమాను మొద‌టిరోజు.. మొద‌టి ఆట చూడాల‌ని ఎంతో మంది కోరుకుంటారు.. అట్లాంటిది ఇప్పుడు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా విడుద‌ల అవుతుంటే.. దాని హంగామానే వేరు.. అయితే మ‌రి సైరా ఇప్పుడు సాహో చిత్రంను దాటేసి పోయిందంటే న‌మ్మ‌గ‌ల‌మా.. ఇది ఏ విష‌యంలో దాటిందో అనే సందేహం క‌లుగ‌క‌మాన‌దు.. ఎందులో నంటే స్పెషల్ షోల ప్ర‌ద‌ర్శ‌న‌లో సాహో చిత్రాన్ని సైరా దాటిపోయింది..

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి, సాహో సినిమాలు ప్ర‌పంచ వ్యాప్తంగా 9వేల థియోట‌ర్ల‌లో విడుద‌ల అయింద‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. మ‌రి సైరా చిత్రం ఎన్ని థియోట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అవుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం అభిమానులు చ‌నిపోయిన రోజులను గుర్తు చేసుకుంటే ఇప్పుడు సైరా చిత్రం కూడా గ‌తం పున‌రావృతం కాకుండా అభిమానులు అధికంగా చూసేలా ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 4620 థియోట‌ర్ల‌లో విడుద‌ల చేస్తుంద‌ట చిత్ర యూనిట్.

అయితే సాహో చిత్రం స్పెషల్ షోలు కేవ‌లం 30వ‌ర‌కు ప్ర‌ద‌ర్శిస్తే.. అదే సైరా చిత్రం మాత్రం 50షోలు వేయ‌నున్న‌ద‌ట‌.. అంటే సాహో క‌న్నా 20 షోలు అధికంగా ఆడుతుంద‌న్న మాట‌.. ఇక సైరా విడుద‌ల చేస్తున్న థియోట‌ర్ల ఏరియాల వారిగా చూస్తే ఇలా ఉన్నాయి. నైజాం 420.. సీడెడ్ 330.. ఆంధ్ర 450 మేర థియేటర్లను కేటాయించారు. ఓవరాల్ గా ఏపీ తెలంగాణలో 1200 థియేటర్లలో రిలీజవుతోంది. కర్ణాటక 340.. తమిళనాడు 350.. కేరళ 130.. థియేటర్లలో రిలీజువతోంది. ఉత్తరాది సహా ఓవర్సీస్ కలుపుకుంటే దాదాపు 3600 థియేటర్లలో రిలీజవుతోంది. అంతే ప్ర‌పంచం మొత్తం 4620 థియోట‌ర్ల‌లో సినిమా విడుద‌ల అవుతుంద‌న్న‌మాట‌..