సురేఖ‌ కోసం ప‌వ‌న్ సినిమా…!

వెండితెర‌పై ప‌వ‌నిజాన్ని రుచిచూపించిన హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అయితే ఇప్పుడు ఆయ‌న పూర్తిగా రాజ‌కీయ నాయ‌కుడిగా మారిపోయి బ‌తుకు బాట నేర్పి, భ‌విష్య‌త్‌కు బాట‌లు వేసిన సినిమా క‌ళామ‌తల్లికి దూర‌మ‌య్యాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. కానీ అన్న మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌టించిన చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా కోసం మ‌రోమారు సినిమా వేధిక‌ల‌పై అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నాడు.

అయితే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక సినిమా చేస్తే చాల‌ని ఆయ‌న అభిమానులు ఇంకా కోరుకుంటున్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు చేసే ఆలోచ‌న లేద‌ని, రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మ‌వుతాన‌ని స్ప‌ష్టం చేశారు. కానీ ఎందుకో ప‌వ‌ర్‌స్టార్‌తో సినిమా చేయించాల‌నే ఆరాటం మెగాస్టార్ చిరంజీవిలోనూ బ‌లంగా ఉంది. అందుకే సైరా సినిమా కోసం ప‌వ‌న్ వాయిస్ ఓవ‌ర్ ఇప్పించి సినిమా వైపు మ‌నుసు లాగేలా చేసాడ‌ట‌. ఫ్రీ రిలీజ్ వేడుక‌ల్లోనూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తిప్పుతున్నాడు.. కార‌ణం ప‌వ‌న్‌ను మ‌రోమారు సినిమాల్లో న‌టించేలా ఒప్పించేందుకేన‌ట‌..

అయితే సైరా సినిమాను స‌మ‌ర్పిస్తున్న మెగాస్టార్ చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ కోసం ఓ సినిమా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తాడ‌నే టాక్ ఇప్పుడు సిని ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తుంది. ఎందుకంటే సైరా ప్ర‌మోష‌న్‌లో భాగంగా సురేఖ ఓ ప‌త్రిక‌కు ఇంట‌ర్య్వూ ఇస్తూ నాకు సినిమాను నిర్మించే అవ‌కాశం నా భ‌ర్త‌, నా మ‌రిది క‌ళ్యాణ్ ఇవ్వ‌లేదు.. కానీ నా కొడుకు ఇచ్చాడు అని గ‌ర్వంగా చెప్పింది. దీంతో అటు చిరంజీవి, ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు మ‌ధ‌న‌ప‌డ్డార‌ట‌.. అందుకే వ‌దిన కోసం మ‌రిది ఓ సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్లు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ లో జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. సో వ‌దిన కోరిక తీర్చేందుకు మ‌రిది సినిమాలో న‌టిస్తాడో చూడాలి…

Leave a comment