ఆ ఒక్కటే బాకీ.. మహేష్ టార్గెట్ ఫిక్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ ఎంటర్‌టైనర్ సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రెడీ అవుతున్నాడని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఇక ఒక్క అంశం మాత్రమే బాకీ ఉందని చిత్ర యూనిట్ పేర్కొంది.

ఈ సినిమా షూటింగ్‌లో ఒక్క షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని.. అది పూర్తయితే టాకీ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ షెడ్యూల్‌లో విలన్ ఇంట్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో భారీ తారాగాణం ఉందన్న విషయం తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తో్న్న సంగతి కూడా తెలిసిందే.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోండగా దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలంటే సంక్రాంతి పండగ వరకు ఆగాల్సిందే.

Leave a comment