4లో 14.. బన్నీయా మజాకా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అల వైకుంఠపురములో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా మేజర్ పార్ట్ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కోసం బన్నీ బరువు తగ్గాడనే విషయం చాలా తక్కువ మందికి తెలుసంటోంది చిత్ర యూనిట్.

ఈ సినిమాలో బన్నీ స్టైలిష్ పాత్రలో కనిపించేందుకు ఏకంగా 14 కిలోల బరువును కేవలం 4 నెలల్లో తగ్గాడట. ఇంత తక్కువ సమయంలో బరువు తగ్గేందుకు బన్నీ పెద్దగా హార్డ్ వర్క్ ఏమీ చేయలేదట. అయితే ఆయన పాటించిన డైట్ అలాంటి ఫలితాన్ని ఇచ్చిందని తెలుస్తోంది. పర్సనల్ ట్రైనర్ సూచనల మేరకు బన్నీ పాటించిన డైట్ ప్రతి రెండు గంటలకు ఓసారి తీసుకునేవాడట. దీంతో ఇప్పుడు బన్నీ లుక్ సాధ్యమైందని తెలుస్తోంది.

ఇకపోతే అల వైకుంఠపురములో చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Leave a comment