ఖైదీ సినిమా కథ చెప్పేసిన కార్తీ

తమిళ హీరో కార్తీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ హీరో చేసిన ప్రతి తమిళ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తాడు. అయితే కొన్ని సినిమాలు మినహా మిగతావన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. అయినా పట్టు వదలకుండా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నాడు కార్తీ. తాజాగా కార్తీ నటించిన ఖైదీ చిత్రం రిలీజ్‌కు రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమా కథ ఏమిటనేది చిత్ర యూనిట్ ముందే చెప్పేయడం గమనార్హం. జీవితఖైదు పడిన ఓ ఖైదీ జైలు నుంచి పారిపోవడం.. అతడి కోసం పోలీసులు, రౌడీలు వెతకడం.. చివరకు అతడు మళ్లీ పోలీసులకు చిక్కడం అనే అంశాలతో సినిమా నడుస్తోందట. అయితే సినిమా కథ మొత్తం ఒక్క రాత్రిలో జరిగే ఘటనగా తెరకెక్కించారు దర్శకుడు. తన కూతురును కలిసేందుకు కార్తీ జైలు నుండి పారిపోయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఏదేమైనా యాక్షన్, ఎమోషన్‌లకు ప్రాముఖ్యత ఇస్తూ ఖైదీ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.

Leave a comment