ఐరన్ మ్యాన్‌గా బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం NBK105 సినిమాలో నటిస్తోన్నాడు. ఈ సినిమాలో బాలయ్య నయా గెటప్స్‌ చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్టులను కూడా క్యూలో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. కాగా బాలయ్యను ఐరన్ మ్యాన్‌గా చూపిస్తానంటున్నాడు ఓ దర్శకుడు.

అవును, అనసూయ లాంటి సినిమాలతో జనాలను భయపెడుతున్న దర్శకుడు రవిబాబు తాజాగా ఆవిరి సినిమాతో మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవిబాబు బాలయ్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. బాలయ్యతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. బాలయ్య తనతో సినిమా ఎప్పుడు చేస్తావని ఓసారి అడిగినట్లు తెలిపాడు. అయితే బాలయ్యతో తాను ఖచ్చితంగా సినిమా చేస్తానని.. ఆ సినిమాకు ఐరన్ మ్యాన్ అనే టైటిల్‌నను తానెప్పుడో అనుకున్నట్లు తెలిపాడు.

టాలీవుడ్‌లో ఐరన్ మ్యాన్‌ అనే టైటిల్ ఒక్క బాలయ్యకు మాత్రమే సూట్ అవుతుందని రవిబాబు తెలిపాడు. ఏదేమైనా ఇప్పుడు రవిబాబు చెప్పిన ఐరన్ మ్యాన్ టైటిల్ సినీ జనాల దృష్టిని ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందో లేదో చూడాలి.

Leave a comment