సైరా సక్సెస్ పార్టీలో బాలయ్య హంగామా

టాలీవుడ్‌లో ఇద్ద‌రు భిన్న‌దృవాలు. ఒక‌రు ఉత్త‌ర దృవం. మ‌రొక‌రు ద‌క్షిణ దృవం. అయితే ఇద్ద‌రు టాలీవుడ్‌లో ఎవ‌రికి వారే త‌మ ప‌ట్టును నిలుపుకుంటున్నారు. న‌ట‌ర‌త్న బాల‌కృష్ణ‌కు తండ్రి వార‌స‌త్వంగా వ‌చ్చిన అభిమానులు, సామ్రాజ్యం ఉంది. అదే మెగాస్టార్‌కు మాత్రం తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న చెక్కుచెద‌ర‌ని మ‌హాసామ్రాజ్యాన్నే నిర్మించుకున్నారు. అయితే ఈ రెండు దృవాలు ఏనాడు క‌లువ‌వు అనేది అంద‌రికి తెలిసిందే.

అయితే ఇప్పుడు వీరిద్ద‌రి న‌డుమ ఏదో జ‌రుగుతుంది అనే సంకేతాలు వ‌స్తున్నాయి.. ఎందుకంటే ఇద్ద‌రు టాలీవుడ్‌లో పోటీ ప‌డి న‌టించారు. సినిరంగంలోనే కాదు.. రాజ‌కీయ రంగంలోనూ ఇద్ద‌రు వేర్వేరు దృవాలే. అలాంటిది ఇప్పుడు ఏదో జ‌రుగ‌రానిది జ‌రుగుతుంద‌నే అనుమానాలు టాలీవుడ్లో చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి.. బాల‌య్య గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో న‌టిస్తే మెగాస్టార్ సైరా న‌ర‌సింహారెడ్డి అంటూ పోటీగా సినిమాలో న‌టించారు..

అంతే కాదు.. బాల‌య్య‌కు, చిరంజీవికి అంత స‌ఖ్య‌త లేద‌నే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తుంది. కానీ ఇది నిజ‌మేనా అనిపించేలా ఇద్ద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అస‌లు ఇద్ద‌రు ఒక్క‌ద‌గ్గ‌ర ఒకే వేదిక‌పై క‌నిపించిన దాఖాలాలు త‌క్కువ‌గా ఉన్నాయి.. కానీ ఎందుకో ఇప్పుడు మెగాస్టార్ నటించిన సైరా చిత్రాన్ని బాల‌య్య వీక్షించాడ‌ట‌.. అంతే కాదు.. సైరా టీం ఇచ్చిన మెగా పార్టీకి కూడా బాల‌య్య హ‌జ‌రయ్యారు. అంతే కాదు బాల‌య్య‌ను పొగుడుతూ మెగాస్టార్ ఇంట‌ర్వూ ఇచ్చారు.. అంటే బాల‌య్య‌, చిరంజీవి న‌డుమ ఇది నిజంగా స్నేహ‌మేనా.. లేక ఏదైనా ఎత్తుగ‌డా అని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Leave a comment