మంచు లక్ష్మికి షాక్ ఇచ్చిన శృతిహాసన్!

టాలీవుడ్ లో విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు వారసులుగా అనగనగా ఒక ధీరుడు సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది మంచు లక్ష్మి. వాస్తవానికి హీరోయిన్ కావాలని వచ్చిన మంచు లక్ష్మి ఈ మూవీలో విలన్ గా నటించింది. టాలీవుడ్ లో ఓ వైపు నటిగా కొనసాగుతూనే మరోవైపు బుల్లితెరపై తన సత్తా చాటుతుంది. యాంకర్ గా పలు షోల్లో కనిపించిన మంచు లక్ష్మి తాజాగా మరో కొత్త ప్రోగ్రామ్ తో వస్తుంది.

‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ తో సెలబ్రెటీల మనసుల్లో ఎమున్నాయి..వారి జీవితంలో జరిగిన తీపి జ్ఞాపకాలు ఇలా ఎన్నో ముచ్చట్లు పెడుతుంది. తాజాగా మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన శృతిహాసన్ తన కెరియర్ గురించి అనేక విషయాలను షేర్ చేస్తూ తన బలహీనతలను బయట పెట్టుకోవడం ఆ షోను చూస్తున్న వారికి షాక్ ఇచ్చింది. తన లవ్ ఎఫైర్ బ్రేకప్ గురించి తాను జీవితంలో చేసిన పొరపాట్ల గురించి అనేక ఆ సక్తికర విషయాలు ఈ షోలో షేర్ చేసింది. ఇదే సందర్భంలో తాను తెలుగులో నటించినటాప్ హీరోలు మహేష్ బన్నీ చరణ్ ల పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

తాను అల్లు అర్జున్ తో నటించినపుడు డ్యాన్స్ విషయంలో కంఫర్ట్ గా ఉన్నా..జూనియర్ తో నటిస్తున్నప్పుడు అతడితో సమానంగా నటించలేక తనకు చుక్కలు కనపడ్డాయని తనకు జూనియర్ ను చంపెద్దాము అన్న కోపం వచ్చిన సందర్భాలు వివరిస్తూ టాప్ హీరోల పై జోక్స్ పేల్చింది.

Leave a comment