త్రివిక్ర‌మ్‌తో సినిమా లైన్ చెప్పేసిన మెగాస్టార్‌

మెగాస్టార్ చిరు అభిమానుల ఊహల్లోని డ్రీమ్ కాంబినేషన్లలో త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ఒకటి. సినిమాల్లోకి చిరు రీ ఎంట్రీ ఇచ్చాక వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాక ప్ర‌స్తుతం ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కే సైరా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా అక్టోబ‌ర్ 2న రిలీజ్ అవుతోంది.

ఈ సినిమా త‌ర్వాత చిరు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. కొర‌టాల స్టైల్లోనే మంచి సందేశాత్మ‌క క‌థాంశంతో ఈ సినిమా ఉండ‌నుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజ‌ల్ లేదా త్రిష‌ల‌లో ఎవ‌రో ఒక‌రు ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఇక చిరు సైరా ప్ర‌మోష‌న్ల‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ సినిమా గురించి ప్రస్తావించారు.

త్రివిక్రమ్ తనకు ఒక లైన్ చెప్పాడని, ప్రస్తుతం వర్క జరుగుతోందన్నారు. త్రివిక్ర‌మ్ సినిమా నూటికి నూరు శాతం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంద‌ని చిరు చెప్పారు. త్రివిక్రమ్ సినిమా అంటే హీరో ఖచ్చితంగా కామెడీ చేయాల్సిందే. ఇక హాస్యాన్ని పండించడంలో చిరు నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక త్రివిక్ర‌మ్ – చిరు కాంబో అంటే ఊహ‌క మంచి థ్రిల్లింగ్‌గా ఉంటుంది. త్రివిక్ర‌మ్ చిరును తెర‌పై ఎలా చూపిస్తాడో ? చిరు ఏ రేంజ్‌లో కామెడీ పండిస్తాడో ? వెయిట్ అండ్ సీ..!

Leave a comment