బిగ్‌బాస్ 3 విన్న‌ర్ ఎవ‌రంటే… ఆ ముగ్గురికే ఛాన్స్‌

తెలుగు బిగ్‌బాస్ 3 సీజ‌న్ ప్రీ క్లైమాక్స్‌కు వ‌చ్చే స‌రికి కాస్త ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. మొదటినుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన సీరియల్ ఆర్టిస్ట్ రవి కృష్ణ ఎలిమినేట్ కావడమే ఇందుకు కారణం. బుల్లితెర మీద సీరియ‌ల్స్ ద్వారా ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన ర‌వికృష్ణ‌కు ఓ త‌ర‌గ‌తి వ‌ర్గం మ‌ద్ద‌తు బ‌లంగా ఉంద‌న్న అంచ‌నాలు ముందు నుంచి ఉన్నాయి. అలాగే ఎలాంటి వివాదాలు లేకుండా అంద‌రిని ఆక‌ట్టుకుంటూ ముందుకు వెళుతున్నాడు.

ర‌వికృష్ణ టైటిల్ కొడ‌తాడ‌న్న అంచ‌నాలు కూడా ముందు నుంచి ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఆదివారం ఆయ‌న హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. షో ప్రారంభం నుంచి చూస్తే హాట్ యాంక‌ర్ శ్రీముఖి, హీరో వరుణ్ సందేశ్‌, డ్యాన్స్ మాస్ట‌ర్ బాబా భాస్కర్, రవి కృష్ణ టైటిల్ హాట్ పేవరేట్స్ గా విన్నర్స్ లిస్ట్ లో ఉంటూ వచ్చారు. మ‌ధ్య‌లో అలీ రెజా కూడా ఆశ‌లు క‌లిగించాడు.

ఇక ఈ వారం నామినేష‌న్ల‌లో ఒక‌రు త‌ప్ప‌నిస‌రిగా బ‌య‌ట‌కు వెళ్లాల్సి రావ‌డంతో ర‌వి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు మాత్ర‌మే ఉన్నారు. వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్ల లో ఒకరు టైటిల్ గెలుస్తారనే వాదన గట్టిగా వినిపిస్తుంది. మ‌ళ్లీ ఈ ముగ్గురిలో కూడా బాబా ఫైన‌ల్ వ‌ర‌కు ఉన్నా శ్రీముఖి వ‌ర్సెస్ వ‌రుణ్ మ‌ధ్యే ఫైట్ ఉంటుంద‌ని అంటున్నారు.

ఇక అలీ రెజా రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయనకు గెలుపు అవకాశాలు తక్కువనే చెప్పాలి. దానికి కారణం ఒకసారి బయటికి వెళ్లొచ్చిన అలీ రెజా గెలిచే ఛాన్సులు లేవు. అయితే అలీ ఫైన‌ల్ వ‌ర‌కు ఉంటాడా ? అన్న‌ది మాత్ర‌మే చూడాలి. ఓవ‌రాల్‌గా ఫైన‌ల్ వీక్‌లో హౌస్‌లో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు ఉంటారు.

Leave a comment