సైరా చిరంజీవి కాకుండా ఎవరెవరి దగ్గరకు వెళ్లింది..?

మెగాస్టార్ చిరంజీవి కలల ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి. తండ్రి కలను నిజం చేసేందుకు సైరా నిర్మాణ బాధ్యతలను మీద వేసుకున్నాడు రాం చరణ్. ఈ సినిమా కథను పరుచూరి బ్రదర్స్ దాదాపు పదేళ్లుగా తీయాలని అనుకున్నారట. అయితే ఈ కథను పట్టుకుని చాలామంది హీరోల దగ్గరకు వెళ్లామని సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నరు పరుచూరి వెంకటేశ్వర్లు. అంటే సైరా కథ చిరంజీవి కోసం రాసింది కాదన్నమాట.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చేసేందుకు బాలకృష్ణ కూడా ఇంట్రెస్ట్ చూపించారట. కాని ఎందుకో ఆయన వెనక్కి తగ్గడం చిరంజీవి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. అయితే చిరు ఓకే చెప్పాక కూడా పదేళ్లుగా సినిమా బడ్జెట్ విషయమై వెయిట్ చేశారట. బాహుబలి తర్వాత వందల కోట్లు పెట్టినా కథలో దమ్ము ఉంటే రాబట్టవచ్చని ప్రూవ్ అయ్యింది.

అందుకే చిరంజీవి కూడా సొంత నిర్మాణంలో సైరా నరసిం హా రెడ్డి మూవీ చేశారు. ఒకవేళ సైరా హిట్ అయితే తండ్రి కలను నిజం చేయడమే కాదు నిర్మాతగా రాం చరణ్ కూడా మరో మెట్టు ఎక్కుతాడని చెప్పడంలో సందేహం లేదు. సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి స్టార్స్ నటించారు. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న సైరా నరసిం హా రెడ్డి సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి.

Leave a comment