నేచురల్ స్టార్ నాని లెటెస్ట్ మూవీ గ్యాంగ్‌లీడర్. 1991లో మెగాస్టార్ చిరంజీవి – విజయశాంతి జంటగా వచ్చిన గ్యాంగ్‌లీడర్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ హిట్ టైటిల్‌తో నాని ఈ సినిమాలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో నాని పెన్సిల్ పార్థసారధి క్యారెక్టర్‌లో నటించాడు. నానితో పాటు హీరోయిన్ అరుళ్ మోహన్ మరో ఐదుగురు లేడీస్‌తో నాని చేసే కామెడీయే ఈ గ్యాంగ్‌లీడర్ సినిమా. చాలా డిఫరెంట్ కథాంశాలతో సినిమాలు చేస్తాడన్న పేరున్న విక్రమ్ ఇప్పుడు గ్యాంగ్‌లీడర్ కోసం కామెడీ సబ్జెక్ట్ ఎంచుకోవడం చాలా షాకింగ్‌గా ఉంది.
ఈ కామెడీ కథను నానితో విక్రమ్ ఎలా డీల్ చేస్తాడన్నదే చూడాలి. మైత్రీ మూవీస్ వారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించారు. రూ.28 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన గ్యాంగ్‌లీడర్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఓవర్సీస్‌లో బుధవారమే ప్రీమియర్ షోలు వేస్తున్నారు.
అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ కానుంది. ఇక కొద్ది రోజులుగా నాని రేంజ్‌కు తగిన హిట్ రావడం లేదు. దేవదాస్, కృష్ణార్జున యుద్ధం ఆశించిన రేంజ్‌లో లేవు. జెర్సీ హిట్ అయినా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. మరి గ్యాంగ్‌లీడర్‌తో నాని చిరు రేంజ్ హిట్ కొడతాడో ? లేదో ? చూడాలి.