గ్యాంగ్ లీడ‌ర్ క‌లెక్ష‌న్లు…

నేచురల్ స్టార్ నానీ నటించిన గ్యాంగ్లీడర్ సినిమా ఇప్పుడు బాక్సాఫీసు వద్ద దుమ్మురేపే కలెక్షన్లతో దూసుకుపోతుంది. నానీ సినిమా గ్యాంగ్లీడరా మజాకా అంటున్నారు సిని విశ్లేషకులు.. నానీ సినిమాలు అంటేనే అటు మాస్ కు ఇటు ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాయి. అందుకే నానీ సినిమాలను ఫ్యామిలీ మెంబర్లంతా కలిసి వీక్షిస్తుంటారు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా కూడా పేరుకు మాత్రమే మాస్గా కనిపిస్తున్నా సినిమా అంతా కామెడీ సినిమాగా ఉండటంతో నానీ అభిమానులు ఆదరిస్తున్నారు

ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది. నానీకి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్తో థియోటర్లు నిండుగా కనిపిస్తున్నాయట. అందుకే నానీతో సినిమా చేస్తే బేఫికర్గా ఉండవచ్చని నిర్మాతలు ఆలోచిస్తుంటారు. ఇప్పడు మైత్రీమూవీ మేకర్స్ సంస్థ కూడా చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నారట. నానీ సినిమాతో వస్తున్న కలెక్షన్లతో ఎంతో భరోసాతో ఉన్నారట.

ఇప్పుడు గ్యాంగ్లీడర్తో నానీ మహిళా ప్రేక్షకుల్లో భారీ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇక సినిమాలో నటీనటులు ఎక్కువగా మహిళలే ఉండటంతో మహిళా ప్రేక్షకులు భారీగానే ఆదరిస్తున్నారు. అందుకే ఈ సినిమా ఇప్పుడు విడుదలైన మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్లు సాధిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూలు ఇలా ఉన్నాయి.

తొలి వీకెండ్ కలెక్షన్లు ఇలా వున్నాయి. బ్రాకెట్ లో సేల్ ఫ్రయిస్.
నైజాం…………………4.67 ..(7.60)
సీడెడ్………………….1.43 ..(3.60)
ఉత్తరాంధ్ర………….1.57 ..(2.50)
ఈస్ట్…………………….1.06 ..(1.60)
వెస్ట్……………………..0.64 ..(1.20)
కృష్ణ……………………..0.94 ..(1.45)
గుంటూరు……………..1.10 ..(1.80)
నెల్లూరు……………….. 0.35..(0.75)

Leave a comment