గుంటూరు గూబ గుయ్‌ అనిపించిన గ్యాంగ్ లీడర్

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్‌లీడర్’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌పై నాని తన ప్రతాపం చూపించాడు. విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో నాని పర్ఫార్మె్న్స్‌కు జనం ఫిదా అయ్యారు. ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి ఆట నుండి మిక్సిడ్ టాక్ రావడంతో సినిమా ఎలా ఆడుతుందా అని సందేహ పడ్డారు. కానీ ఫస్ట్ వీకెండ్ రిజల్ట్ చూశాక నాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అందరూ డిసైడ్ అయ్యారు.

ఇక ఈ సినిమా తొలి వారాంతం ముగిసే సరికి అదిరిపోయే వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గుంటూరులో ఈ సినిమా కొత్త రికార్డులకు నాంది పలికింది. కేవలం మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ. 1.03 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. నాని క్రేజ్ కారణంగా మాత్రమే ఈ సినిమా ఇలాంటి వసూళ్లు సాధించిందంటే నానికి అక్కడ ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ఇట్టే అర్ధం అవుతోంది. ఈ సినిమా షోకు 90 శాతం అక్యుపెన్సీ ఉందంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతమేర నచ్చిందో చెప్పేయొచ్చు.

విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాని తన ఒంటి చేత్తో లాక్కొచ్చాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.

Leave a comment