Movies' ఎవ‌రు ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..

‘ ఎవ‌రు ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..

టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం ఇద్ద‌రు యంగ్ హీరోలు త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. శ‌ర్వానంద్ ర‌ణ‌రంగం సినిమాతో, అడ‌వి శేష్ ఎవ‌రు సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద ఇండిపెండెన్స్ డే కానుక‌గా పోటీ ప‌డ్డారు. ఇక ఎవ‌రు సినిమాకు ముందు నుంచి అడ‌వి శేష్‌తో పాటు సినిమా మేక‌ర్స్ బాగా ప్ర‌మోష‌న్ చేసుకున్నారు.

రిలీజ్‌కు ముందు రోజే ప్రీమియ‌ర్ షో కూడా వేశారు. గురువారం ఉద‌యానికి అన్నిచోట్ల ఎవ‌ర‌కు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. చిక్కుముడుల థ్రిల్ల‌ర్‌గా ప్ర‌శంస‌లు అందుకున్న ఈ సినిమాకు ప్రేక్ష‌కుల‌తో పాటు రివ్యూవ‌ర్ల నుంచి కూడా మంచి మార్కులే ప‌డ్డాయి. తొలి రోజు ఎవ‌రు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1.7 కోట్ల షేర్‌ సాధించింది.

అటు వైపు శ‌ర్వానంద్ ర‌ణ‌రంగం సినిమాతో పోటీ ఎదుర్కొని మ‌రీ ఎవ‌రు ఈ మాత్రం వ‌సూళ్లు సాధించ‌డం గ్రేట్ అని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తం రూ. 7.7 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఎవ‌రు సేఫ్ జోన్‌లోకి త్వ‌ర‌గా వ‌చ్చి లాభాల భాట ప‌ట్ట‌నుంద‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు.

అడ‌వి శేష్ సినిమాల్లో ఇవే తొలి ఫ‌స్ట్ డే వ‌సూళ్లు కావ‌డం విశేషం. గూఢ‌చారితో హిట్ కొట్టిన శేష్ 2019లో ఎవ‌రుతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో రెజీనా నెగెటివ్ చర్యలకు మంచి ప్రశంసలు అందుకుంటోంది. పివిపి సినిమా నిర్మించిన ఈ చిత్రానికి వెంకట్ రామ్‌జీ దర్శకత్వం వహించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news