Moviesఅల్లు అల వైకుంఠపురములో ఏమి చేస్తున్నాడు....!!!

అల్లు అల వైకుంఠపురములో ఏమి చేస్తున్నాడు….!!!

స్టైలీష్స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పేరేందో పంద్రాగస్టు రోజున చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. దీంతో ఇంతకాలం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాకు ఏమి పేరుపెట్టారో అనే సందిగ్థతకు తెరదించినట్లైంది. ఇంతకు సినిమా పేరందో తెలిసి పోయింది కదా… అదేనండీ అల వైకుంఠపురము అనే టైటిల్ ఖరారు చేశారు. ఈసినిమాను గీతా ఆర్ట్స్, హారీని హసిని క్రియోషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇంతకు అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ ఏమి చేస్తున్నట్లు అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఈ సస్సెన్స్కు తెరపడాలంటే సినిమాకు సంబంధించిన అప్డేట్ను చిత్ర యూనిట్ ఇచ్చేవరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ నటించస్తున్న 19వ చిత్రం అల వైకుంఠపురములో…మరి వైకుంఠపురములో ఏమి జరిగిందో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కే తెలియాలి.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుని 2020 జనవరి మాసంలో సంక్రాంతి సంబరాలకు విడుదల కానున్నది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న మూడో చిత్రం ఇది. ఇంతకు ముందే జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో నటించాడు. ఈ రెండు చిత్రాలు అల్లు అర్జున్కు హిట్ అందించాయి. బన్నీ సరసన పూజాహెగ్డే నటిస్తుంది. ఇందులో సుశాంత్ అల్లుకు బావాగా, కీలకమైన పాత్రలో టబు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news