టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వార్‌… గెలుపు ఎవ‌రిదో…

టాలీవుడ్‌లో ప్ర‌తి శుక్ర‌వారం లెక్క‌లు మారిపోతుంటాయి. శుక్ర‌వారం వ‌చ్చిందంటే ఎవ‌రి త‌ల‌రాత ఎలా ఉంటుందో ? అన్న టెన్ష‌న్ అంద‌రికి ఉంటుంది. ఈ శుక్ర‌వారం నాగార్జున మ‌న్మ‌థుడు 2, సంపూర్ణేష్ కొబ్బ‌రిమ‌ట్ట‌, అన‌సూయ క‌థ‌నం, విశాల్ అయోగ్య సినిమాలు వ‌చ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో ఒక్క కొబ్బ‌రిమ‌ట్ట సినిమాకు మినహా మిగిలిన సినిమాల‌ను ప‌ట్టించుకున్న వారు లేరు. ఇక వ‌చ్చే శుక్ర‌వారం కూడా రెండు ఇంట్ర‌స్టింగ్ సినిమాల మ‌ధ్య ఆస‌క్తిక‌ర ఫైట్ జ‌ర‌గ‌నుంది.

ఈ ఇద్ద‌రు యంగ్ హీరోలే కావ‌డం విశేషం. రణరంగం సినిమా విష‌యానికి వ‌స్తే హీరో శర్వానంద్, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్‌లో ఈ సినిమా వ‌స్తోంది. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్‌లు హీరోయిన్లు. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమా వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కింది.
90వ దశకం స్టోరీతో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నాడు.

శ‌ర్వానంద్ గ‌త నాలుగు, ఐదు సంవ‌త్స‌రాల‌లో ప్రేమ‌, ఫ్యామిలీ స్టోరీలే చేశాడు. ఇప్పుడు కంప్లీట్ డిఫ‌రెంట్ జాన‌ర్‌లో ఈ సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ యాక్ష‌న్ డ్రామాగా ఉంటుంద‌ని అంటున్నారు. ఇక అదే రోజు వ‌స్తోన్న మ‌రో సినిమా ఎవ‌రు. అడివి శేష్ – రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో వెంకట్ రాంజీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది.

క్షణం – గూఢచారి సినిమాలతో సోలో హీరోగా అద్భుత విజయాలు అందుకున్న అడివి శేష్.. ఈ మూవీతో మరోసారి తన మ్యాజిక్ చూపించనున్నాడు. మరి ఈ ఇద్దరిలో బాక్స్ ఆఫీస్ కింగ్‌గా ఎవరు నిలుస్తారో ? వేచి చూడాలి.

Leave a comment