వాల్మీకి టీజ‌ర్ వచ్చేసిందోచ్..

మెగా ప్రిన్స్ కొణిదేల వరుణ్తేజ్ నటిస్తున్న చిత్రం వాల్మీకి చిత్రం టీజర్ విడుదలకు సిద్దమైంది. వాల్మీకి సినిమా టీజర్ను ఈనెల15న పంద్రాగస్టును పురస్కరించుకుని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్, చిత్ర హీరో వరుణ్తేజ్ తన సోషల్ మీడియా ఖాతా ట్వీట్టర్లో కొద్దిసేపటి క్రితమే పోస్టు చేశారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి.

వరుణ్తేజ్ సరసన అందాల నటి పూజాహెగ్డే నటిస్తుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఇప్పుడు టీజర్ విడుదలను ప్రకటిస్తూ మరో పోస్టర్ను విడుదల చేసింది. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూనే మరోవైపు సినిమా కు సంబంధిచిన పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా జరుపుకుంటుందనేటి టాక్.

వాల్మీకి టైటిల్పై ఇప్పటికే అనేక వివాదాలు నడుస్తున్నాయి. టైటిల్ మార్చాలంటూ బోయకులస్తులు ఇప్పటికే అనంతపురంలో జరుగుతున్న షూటింగ్ను అడ్డుకున్నారు. తదుపరి కూడా బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు వాల్మీకి సినిమా పేరు మార్చాలని చిత్ర యూనిట్కు హెచ్చరిక జారీ చేశాడు. అయినా దర్శకుడు హరీష్శంకర్ మొండిగానే ముందుకు పోతున్నాడు. ఇక సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నారు.

222

Leave a comment