`సాహో` నిర్మాత‌ల‌పై టాలీవుడ్ ఆగ్ర‌హం..!

ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `సాహో` చిత్రంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, శ్రద్ధా క‌పూర్ క‌లిసి న‌టిస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఆగ‌ష్టు 30న విడుద‌ల కాబోతుంది. దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ కాబోతుంది. యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

అయితే పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ల రిలీజ్‌ తరువాత మ‌రింత బ‌జ్ పెంచాయి. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. అలాగే రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఇటీవ‌ల `సాహో` ప్రీ రిలీజ్ వేడుక కూడా హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో ఆదివారం సాయంత్రం జ‌రుపుకుంది. అయితే `సాహో` పై మంచి హైప్ రావ‌డంతో.. ఈ చిత్రం టిక్కెట్ రేట్లు పెంచటానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే సాహో బెనిఫిట్ షోల రెండు తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఆగష్టు 29 రాత్రి సాహో స్పెషల్ స్క్రీనింగ్ థియేటర్లలో రానున్నట్టు తెలుస్తోంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ఇలాంటి స‌మ‌యంలో టిక్కెట్‌పై రేటు పెంచ‌డంలో టాలీవుడ్ నిర్మాత‌ల‌పై గుర్రుగా ఉన్నాయి. అయితే ఎక్కువ రేట్లు పెంచ‌డం వ‌ల్ల‌ డిస్ట్రిబ్యూటర్స్‌కు కొద్ది సమయంలోనే తాము పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చే అవకాసం ఉంటుంది. టిక్కెట్ ధర రూ. 500/- నుంచి స్టార్ట్‌ అవుతుందని స‌మాచారం.

దీనికి ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి కోసం వేయిట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. కానీ.. సామాన్యుడి జేబులు గుల్ల చేయ‌డానికి డిసైడ్ అయ్యార‌ని నిర్మాత‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్, ప్రేక్ష‌కుల నుంచి సినిమా రిలీజ్ టైంలో రేట్లు పెంచ‌డంపై తీవ్ర‌మైన విమర్శ‌లు గుప్పుమంటున్నాయి.

Leave a comment