” సాహో ” సెన్సార్ రివ్యూ.. షాక్ లో ఫ్యాన్స్..!

సిని లవర్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో సినిమా రిలీజ్ కు ఇంకా 8 రోజులు మాత్రమే ఉంది. మాస్ కా బాప్ అన్నట్టుగా ప్రభాస్ వీరోచిత యాక్షన్ ఘట్టాలతో వస్తున్న సాహో బాహుబలి తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు. సుజిత్ డైరక్షన్ లో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను బుధవారం పూర్తి చేసుకుంది.

సెన్సార్ సభ్యులు సాహో సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తుంది. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉన్నాయని సెన్సార్ సభ్యులు కూడా చిత్రయూనిట్ ను మెచ్చుకున్నారట. తెలుగు సినిమా స్టాండర్డ్స్ ను మరింత పెంచేలా సాహో ఉంటుందని తెలుస్తుంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందించారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాగా సాహోపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. దానికి తగినట్టుగానే సినిమా ప్రమోషన్స్, ప్రచార చిత్రాలు ఉన్నాయి. తప్పకుండా సాహో ప్రభాస్ కెరియర్ లో మరో సెన్సేషనల్ సినిమా అవుతుందని తెలుస్తుంది. సెన్సార్ నుండి సూపర్ అన్న టాక్ రావడంతో చిత్రయూనిట్ సినిమా ఫలితం మీద మరింత నమ్మకంగా ఉన్నారు.

Leave a comment