సాహోకు బాలీవుడ్ సినిమాల సాహో

భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘సాహో’ ఈ నెల 30న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా సోలో రిలీజ్ ఇచ్చేందుకు బాలీవుడ్‌, కోలీవుడ్ టాప్ హీరోల సినిమాలు కూడా సైడ్ అవుతున్నాయి. సాహోకు సోలో డేట్ ఇచ్చేందుకు ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు త‌మ సినిమాల రిలీజ్ వాయిదా వేసుకున్నాయి. ఈ సందర్భంగా వారికి రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ధన్యవాదాలు తెలిపారు.

వాస్త‌వానికి సాహో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాక‌పోవ‌డంతో ఈ సినిమాను ఆగ‌స్టు 30కు వాయిదా వేశారు. దీంతో అదే రోజు రావాల్సిన సినిమాల‌కు స్క్రీన్ల ప‌రంగా ఇబ్బందులు త‌ప్ప‌లేదు. అందుకే సాహో కోసం మిగిలిన సినిమాల ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు రాజీ ప‌డి మ‌రీ త‌మ సినిమాలు వాయిదా వేసుకున్నారు.

ముందుగా నాని గ్యాంగ్‌లీడ‌ర్ ఆగ‌స్టు 30న ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు సాహో కోసం ఆ సినిమాను వాయిదా వేస్తున్నారు. సాహో వాయిదాతో తెలుగు చాలా సినిమాల రిలీజ్ డేట్లు మారాయి. ఇక సూర్య బందోబ‌స్త్ కూడా సెప్టెంబ‌ర్‌కు వెళ్లిపోయింది. రెండు బాలీవుడ్ సినిమాలు కూడా త‌మ డేట్లు మార్చుకోక త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే రిలీజ్ వాయిదా వేసుకున్న సినిమాల యూనిట్‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ప్రభాస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సోషల్‌మీడియాలో పోస్టులు చేశారు.

సాహో సోలో రిలీజ్‌కు దారి ఇచ్చిన వారికి ధ‌న్య‌వాదాలు. తమ చిత్రాల విడుదల తేదీలు రీ-షెడ్యూల్‌ చేసుకున్నందుకు నటీనటులు, దర్శకులు, నిర్మాతలకు బిగ్‌ థాంక్స్‌. ‘సాహో’ చిత్ర బృందం మీకు ధన్యవాదాలు చెబుతోంది. అదేవిధంగా మీకు ఆల్‌ ది బెస్ట్‌. మీపై ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటాయ‌ని ప్రభాస్‌ పోస్ట్‌ చేశారు.

Leave a comment