సాహో ట్రైలర్ కు అదిరిపోయే ప్లానింగ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా సాహో. 250 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. బాహుబలి తర్వాత వస్తున్న సినిమాగా సాహోపై తారాస్థాయిలో అంచనాలున్నాయి. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 30న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 10న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ ఈవెంట్ కూడా ఐదు ప్రాంతాల్లో రిలీజ్ చేస్తున్నారు. ముందుగా ఆగష్టు 10న ముంబైలో ట్రైలర్ లాచ్ చేస్తారట. ఆగష్టు 11న హైదరాబాద్ లో ట్రైలర్ తో పాటుగా మీడియా ఇంటరాక్షన్ ఉంటుందట. 12న చెన్నైలో ఈవెంట్ ప్లాన్ చేశారు. 13న కొచ్చిలో సాహో ట్రైలర్ ఈవెంట్ ఉంటుందట.

ఫైనల్ గా ఆగష్టు 14న న్యూ ఢిల్లీలో సినిమా ఈవెంట్ ప్లాన్ చేశారట. మొత్తానికి దేశం మొత్తం సాహో ఫీవర్ తెప్పించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ సాహోతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా ట్రైలర్ గురించి ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

Leave a comment